నందమూరి బాలకృష్ణ….నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు బాలకృష్ణ. బాలకృష్ణ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ డూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాడు. ఇక బాలకృష్ణ కు భార్య వసుంధర, ఇద్దరు కూతుర్లు బ్రాహ్మణి, తేజస్విని కొడుకు మోక్షజ్ఞ ఉన్నారు. కూతుళ్లకు పెళ్లిళ్లు అయిపోయాయి. అలాగే త్వరలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు హీరోయిన్లతో ఎఫైర్స్ ఉంటాయి. అయితే బాలకృష్ణ విషయంలో మాత్రం ఇన్నేళ్ల కెరీర్లో ఏనాడు అలాంటి పుకార్లు రాలేదు. కానీ ఓ హీరోయిన్ ను మనస్ఫూర్తిగా ప్రేమించాడట బాలయ్య. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సైతం బాలకృష్ణ మద్రాస్ హీరోయిన్ ను ప్రేమించాడని గతంలో చెప్పుకొచ్చాడు.
ఆర్ఆర్ఆర్ ‘మల్లి ‘ బ్యాగ్రౌండ్ తెలుసా ? 160 మందిలో ఒకరు ఆ చిన్నారి!!
అయితే అది నచ్చని ఎన్టీఆర్ వెంటనే పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాడట. ఆ నేపథ్యంలోనే తమ బంధువులు అమ్మాయి అయిన వసుంధర తో పెళ్లి చేశారట. అలాగే బాలయ్య సినిమాలకు కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ రాపాక కూడా బాలకృష్ణ గురించి గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలయ్య ఇంట్లో చాలా సింపుల్ గా ఉంటాడని, చిన్న పిల్లల మనస్తత్వమని, లోపల ఒకటి ఉంచుకుని బయటకి మరొకటి మాట్లాడటం రాదని చెప్పుకొచ్చింది. తన లవ్ స్టోరీ గురించి కూడా తనకు చెప్పారని తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో పిక్స్ చూశారా
అయితే ఆ హీరోయిన్ పేరు మాత్రం శ్రీ రాపాక చెప్పలేదు. కానీ వారిద్దరూ సిన్సియర్ గా, సీరియస్ గా లవ్ చేసుకున్నారని షూటింగ్ జరుగుతున్నప్పుడు బోర్ గా ఉన్న సమయంలో బాలయ్య ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతారని చెప్పింది.
బాలయ్య ఆ హీరోయిన్ ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారని అయితే హరికృష్ణతో పాటు నాన్న ఎన్టీఆర్ కు ఇష్టం లేకపోయిందని ఆమె తెలిపారు. అటు నాదెండ్ల ఇటు శ్రీ రాపాక ఇద్దరు కూడా ఆ హీరోయిన్ పేరు చెప్పక పోయినప్పటికీ అప్పట్లో వినిపించిన వార్తల ప్రకారం బాలయ్య ప్రేమించిన హీరోయిన్ ఖుష్బూ అని టాక్.
సినిమా వాళ్లు తన ఇంటికి కోడలిగా వస్తే సరిగా ఉండరేమోనన్న భయంతోనే ఎన్టీఆర్ అప్పుడు నో చెప్పారట. అందుకే సాంప్రదాయ కుటుంబానికి చెందిన వసుంధరను తన ఇంటికి కోడలిగా చేసుకున్నారట ఎన్టీఆర్.