స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గంగోత్రి సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆర్య తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. అక్కడి నుంచి కూడా సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు. ఇటీవలే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమాతో స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప పార్టు 2 చేస్తున్నాడు.
ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. టిఆర్ఎస్ నేత ప్రభాకర్ రెడ్డి కూతురు స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక బాబు… ఒక పాప. ఇక అల్లుఅర్జున్ భార్య కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే అల్లు అర్జున్ స్నేహారెడ్డి ని ప్రేమించక ముందు వేరొక హీరోయిన్ ను సిన్సియర్ గా లవ్ చేశాడట. కానీ ఆమె వేరొకరిని వివాహం చేసుకుందట. దీంతో అల్లు అర్జున్ అప్పుడు చాలా బాధ పడ్డాడట.
ALSO READ : దాన వీర శూర కర్ణ బడ్జెట్ కు 15 రెట్లు లాభాలు… లెక్కలు మారాయి!!
అవును ఈ విషయాన్ని స్వయంగా అల్లు అర్జున్ అప్పట్లో ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అల్లు అర్జున్ ప్రేమించింది మరెవరో కాదట… మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్. 2007లో అభిషేక్ బచ్చన్ ను ఐశ్వర్య రాయ్ వివాహం చేసుకుంది. ఆమె వివాహం జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఎంతగానో బాధ పడ్డాడట.
ఎన్టీఆర్, చిరు లే కాదు అక్కినేని కూడా సాధించిన ఈ 7 ఇండస్ట్రీ హిట్ సినిమాల గురించి మీకు తెలుసా ?