టాలీవుడ్ హీరోల పేరు చివర‘బాబు’అనే పదం ఎప్పటినుంచో తిష్టవేసుకుని కూర్చుంది. అసలు పేరు చివర ‘బాబు’ తగిలించడానికి కారణం ఏంటి..అసలు ఆ ‘బాబు’కితాబు ఎలా పుట్టుకొచ్చిందో చూద్దాం.
ఇది1940ల నాటి మాట. అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమాలలో నటించే వారిని ఆర్టిస్టులని ఎలా పిలిచేవారు, వారికి ఎలాంటి గౌరవాలు దక్కేవి అనే అంశం మీద ఓ ఉదాహరణ గా చెప్పారు.
ఆరోజుల్లో తాను చిన్న హీరో కాబట్టి అప్పటి సీనియర్ దర్శకుడు నన్ను చులకనగా మాట్లాడటం బాగా అలవాటుగా మారింది. అక్కినేనిని కూడా ఓ అనరాని మాటతో పిలుస్తూ ఉండేవారట. తన కన్నా సీనియర్ కాబట్టి ఆయన్ను ఏమనలేకపోయారట అక్కినేని. ఏమైనా అంటే ఉన్న కాస్త వేషం కూడా ఇవ్వరని ఆయన బాధ.
నెల జీతం మీద పని చేసే అక్కినేనికి బాలరాజు సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాత కూడా మళ్లీ మరో సినిమా చేయాలంటే నా దగ్గరకు రా అబ్బాయి అని ఆ దర్శకుడు పిలిచాడట.
కానీ అక్కినేని తనని ఆ ఒక్క మాటతో పిలవడం ఆపేస్తే తప్ప తాను రాను అని చెప్పాశాడట.దీంతో భలేవాడివే రా వచ్చేయ్.ఇక అలా పిలవనులే అని భరోసా ఇచ్చారట.
అదే సమయంలో భానుమతి గారికి అలాంటి సంఘటనలు చాలా జరిగాయి.ఆ తరం వారు మర్యాద కోసం ఎన్నో పాట్లు పడ్డారు. పైగా ఆ సమయంలో ఆర్టిస్టులు అంటే ఒక చులకన భావం ఉండేదట.
హెచ్.ఎం.రెడ్డి, కే.వీ.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు తరువాత ఎన్టీఆర్ అక్కినేని వంటి నటులు సీనియర్స్ గా చలామణి చేశారు. అప్పుడే కొత్తగా వచ్చే నటులకు సీనియర్స్ అయినా హీరోలకు గౌరవం ఇవ్వాల్సి వచ్చింది.
దీంతో సార్, బాబు, అయ్యా అనే పదాలు పుట్టుకు వచ్చాయి. ఎన్టీఆర్ కొడుకైన హరికృష్ణను ముద్దుగా బాబు అని, బాలకృష్ణను బాలయ్య అని సంబోధించడం ప్రారంభించారు.ఇక అక్కినేని కుమారులైన వెంకట్ ని పెదబాబుగా, నాగార్జునను చినబాబుగా పిలిచేవారు. అలా హీరోల పిల్లలను ఫార్మాలిటీగా బాబు అని పిలవడం ప్రారంభమైంది.
అదే ‘బాబు’ను కృష్ణ తన కొడుకులకు తగిలించారు. దీంతో గౌరవ పదం కాస్తా రమేష్ బాబు, మహేష్ బాబు పేర్లలో ఫిక్స్ అయిపోయాయి. ఏదైతేనే బాబు అనే పదం ప్రస్తుతం పిచ్చిగా మారిపోయింది.
Also Read: సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడో చూసారా..!?