సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలు పెంచాయి.
తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. సినిమాకథ చెప్పడానికి పరశురామ్ వచ్చి మొదట కొన్ని సీన్లు చెప్పాడని వెంటనే సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం కలిగిందని అందుకే ఓకే చేశానని చెప్పుకొచ్చారు మహేష్.
సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు మీకు తెలుసా !! షాక్ అవ్వాల్సిందే
అలాగే కథ చెప్పి ఇంటికి వెళ్ళిన వెంటనే నాకు మెసేజ్ పెట్టాడని ఒక్కడు సినిమా చూసిన తర్వాత నాకు డైరెక్టర్ అవ్వాలన్న కోరిక కలిగింది సార్, ఆ సినిమా ప్రేరణతోనే ఇండస్ట్రీలోకి కూడా వచ్చాను. ఈ సినిమా ఎలా తీస్తానో చూడండి సార్ అని పరశురామ్ చెప్పినట్లు తెలిపారు మహేష్.
మళ్లీ లొల్లి… ప్రీతమ్ కు ఐ లవ్ యూ చెప్పిన సమంత!!
నా అభిమానులకు, నాన్న అభిమానులకు పరశురామ్ ఫేవరెట్ దర్శకుడు అవుతాడని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. లవ్ ట్రాక్ తో పాటు యాక్షన్ సీన్లు కామెడీ చాలా హైలెట్ గా ఉంటాయని తెలిపారు. ఒక సినిమాలో పది నుంచి పదిహేను నిమిషాలపాటు ఏదైనా ఇంట్రెస్టింగ్ ట్రాక్ ఉంటుంది… కానీ ఫస్టాఫ్ లో 45 నిమిషాల పాటు సీన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అది అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు మహేష్. మరి మహేష్ అంత నమ్మకం పెట్టుకున్న సర్కారు వారి పాట చిత్రం ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.