టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా రాజమౌళి పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. అగ్ర హీరోలు అందరూ ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సీరీస్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న జక్కన్న… చాలా రోజులుగా మంచి మల్టీ స్టారర్ కోసం ఎదురు చూస్తున్న ఫాన్స్ కి తన ఆర్ఆర్ఆర్ సినిమాతో షాక్ ఇచ్చేసాడు.
ఇక మహేష్ తో చేసే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటి వరకు జక్కన్న చేసిన అన్ని సినిమాలు హిట్ కావడంతో ఇప్పుడు వచ్చే సినిమాలపై భారీ అంచనాలు ఉంటున్నాయి. ప్రభాస్ తో మళ్ళీ ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో కూడా చేసే అవకాశం ఉందనే ప్రచారం సైతం బలంగా జరుగుతుంది.
ఇదిలా ఉంచితే… శాంతి నివాసం సీరియల్ కి దర్శకత్వం వచించిన జక్కన్న డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చేశారు. అలా అని కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్పారు. ఆయన డబ్బింగ్ చెప్పిన సినిమా ఏదో కాదు ఛత్రపతి. ఈ సినిమాలో ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పాడు. ప్రభాస్ వాయిస్ గతంలో రాజమౌళి మాదిరి గానే ఉండేది.