కొన్ని సినిమాలు ఒకే స్టోరీ లైన్ తో రావడం గురించి మనం చూస్తూనే ఉంటాం. కథ ఎంత జాగ్రత్తగా తీసుకున్నా సరే ఒకే లైన్ తో వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా వచ్చే క్రమంలో సినిమాల మధ్య కొన్నాళ్ళు గ్యాప్ ఉంటుంది. కాని ఒక రెండు స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఒకే రోజు ఒకే లైన్ తో విడుదల అయ్యాయి. సినిమాలు చూసే వరకు కూడా ఆ విషయం హీరోలకు కూడా అర్ధం కాలేదట.
అసలు ఏంటి ఆ కథ అనేది చూద్దాం. 1989 వ సంత్సరం జూన్ 26న వెంకటేష్ హీరో గా చేసిన దృవ నక్షేత్రం సినిమా విడుదల అయింది. అదే రోజున బాలకృష్ణ నటించిన అశోక చక్రవర్తి సినిమా కూడా విడుదల చేసారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. రెండు కథలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక సినిమా తీసే దర్శకులకు కూడా ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యపరిచిన విషయం.
కాగా ప్రస్తుతం బాలకృష్ణ అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలో నటిస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమా మంచి హిట్ కొట్టింది. ఈ ఏడాది రెండు మూడు సినిమాలను ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ విషయానికి వస్తే సైంధవ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా లుక్ ఇటీవల విడుదల కాగా చాలా మంచి స్పందన వచ్చింది.