గత కొన్ని రోజులుగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్న బాలీవుడ్ కి పఠాన్ సినిమా కాస్త బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా హిట్ టాక్ రావడంతో అక్కడి స్టార్ దర్శకులు హీరోలు ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచారు. ముఖ్యంగా బాలీవుడ్ లో బాయ్ కాట్ అనే నినాదం కాస్త ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. అయినా సరే పఠాన్ సినిమాకు చాలా మంచి స్పందన వచ్చి మంచి వసూళ్లు సాధించింది.
ఈ సినిమా విషయంలో బాద్షా షారూక్ ఖాన్ కాస్త ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకున్నారు అని చెప్పాలి. కథ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టడం సినిమా ఆలస్యం అయినా సరే భయపడకపోవడం వంటివి జరిగాయి. ఇక ఈ సినిమాలో ఆయన సిక్స్ ప్యాక్ చూపించి కాస్త సంచలనం సృష్టించారు. ఈ వయసులో కూడా అలా కనపడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇక దీపికా కూడా అందాలను ఏ మాత్రం దాచుకోలేదు.
ఇదిలా ఉంచితే ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన బేషరమ్ రంగ్ పాట ప్రారంభంలో, షారుక్ ఖాన్ గ్రీన్ ప్రింటెడ్ షర్ట్ తో కనపడతారు. ఈ షార్ట్ ఫాన్స్ కి బాగా నచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ అయింది. విస్కోస్ క్రేప్ ఫాబ్రిక్ అయిన ఫుల్ స్లీవ్ షర్ట్ ఇది. ఈ షర్ట్ లో పైస్లీ ప్రింట్ కూడా ఉండటం విశేషం. ఈ షర్ట్ రీతూ కుమార్ వెబ్ సైట్ లో రూ.9,200కి అందుబాటులో ఉంచారు.