సినిమా వాళ్ళు ధరించే వస్తువుల విషయంలో ఫాన్స్ తో పాటు సామాన్య జనానికి కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. స్టార్ నటుల లైఫ్ స్టైల్ మీద సామాన్యులు కాస్త ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానిపై కూడా ఒక కన్నేసి ఉంచుతారు. వాళ్ళు వాడే బట్టలు, కార్లు, ఖరీదైన వస్తువుల గురించి సోషల్ మీడియాలో కూడా టాక్ నడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ హీరో షారుఖ్ ఖాన్ గురించి చర్చ నడుస్తుంది. ఆయన ధరించే వాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వాచ్ ధర ఏకంగా నాలుగు కోట్ల 75 లక్షలకు పైగానే ఉంది. ఆ వాచ్ అమ్మితే మధ్య తరగతి ఫ్యామిలీల జీవిత కలలు అన్నీ తీరిపోతాయి మరి. ఆ రేంజ్ లో ఉంది రేటు. బ్లు సిరామిక్ ఏపీ పర్మనెంట్ క్యాలెండర్ వాచ్ ను ధరించిన షారుఖ్ ఫోటో ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
గత ఏడాది ఆగస్ట్ లో విడుదల చేసారు ఇది. ఇందులో వారాలు, నెలలు ఉన్నాయి. పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు లపై 18 క్యారెట్ల బంగారం తాపడం కూడా ఉంది. షారుఖ్ ప్రస్తుతం పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో జాన్ అబ్రహం కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.