పెళ్లి…. ప్రతి ఒక్కరి జీవితంలో వచ్చే మధుర ఘట్టం. ఎంతో మంది యువతీ యువకులు ఈ మూడు ముళ్ళ బంధంతోనే ఒకటవుతారు. అయితే చాలామంది పెళ్లి విషయంలో వెనక్కి అడుగులేస్తూ ఉంటారు. అలా తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొంతమంది విలాసాలకు అలవాటు పడి పెళ్లిని ఆలస్యంగా చేసుకుంటారు.
మరికొంతమంది లైఫ్ లో సెటిల్ అవ్వలేదని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు. అలాగే మరికొంత మంది మొదట పెళ్లి అనగానే సిగ్గు పడతారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు అడగడం మానేశాక అడగడానికి మొహమాటం పడుతూ ఆలస్యం అవుతూ ఉంటారు. ఆడపిల్లల అవని మగపిల్లల అవని ఎవరైనా సరే సరైన సమయానికి పెళ్లి చేసుకోవాలి.
శ్రీకాంత్ అంత ధైర్యం చేశాడా ? ఊహ తల్లిదండ్రుల ముందే ప్రపోజ్ చేసేశాడట!!
ఎందుకు అంటే ఆలస్యంగా వివాహం చేసుకున్నవారు మనవరాళ్లతో, మనవళ్ళతో ఆడుకోవాల్సిన సమయంలో పిల్లలను ఆడిస్తూ ఉంటారు. అలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లల జీవితాలపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.
ఎన్టీఆర్ కోసం అప్పట్లో కృష్ణ ఇచ్చిన ప్రకటన గురించి తెలుసా ?
వయసు ఎక్కువగా ఉండటం వల్ల అంతగా కష్టపడలేరు. అలాగే పిల్లలు కూడా అప్పటికి సెటిల్ అవ్వకుండా ఉంటారు. ఈ విధంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి తగిన సమయంలోనే వివాహం చేసుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.