నిన్న యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి హీరో తారకరత్న ఆరోగ్యంపై ఇప్పుడు కాస్త ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన ఆరోగ్యంపై నేడు విడుదల చేసిన బులిటెన్ లో పలు సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రెండు సార్లు ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలుస్తుంది. ఇక బెంగళూరు లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆరోగ్యం విషమంగా ఉన్నా సరే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
దీనికి సంబంధించి రేపటిలోగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టాక్. వరుస పర్యటనలతో తారకరత్న బిజీ కావడంతోనే ఇలా జరిగిందని అంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులు అందరూ బెంగళూరు వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు కూడా బెంగళూరులోనే ఉన్నారు. ఇదిలా ఉంచితే తారక రత్నకు విజయసాయి రెడ్డికి మధ్య బంధుత్వం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.
విజయ్ సాయి రెడ్డి భార్య సునంద సొంత చెల్లెలి కుమార్తె అలేఖ్యను నందమూరి తారక రత్న ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇందుకోసం పెద్దలను సైతం అతను ఎదిరించారు అని టాక్. అయితే బాలకృష్ణ ఒక్కరే అందుకు అంగీకరించారు అని అంటున్నారు జనాలు. అలేఖ్య ఫిలిం ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తున్నారు. విజయసాయి రెడ్డి… తారకరత్నకు మామగారు అవుతారు. తారకరత్న చేసే సినిమాలకు అన్నీ ఆమె దగ్గరుండి చూసేవారు.