ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. ఈ సినిమాకు సీక్వెల్ గా కే జి ఎఫ్ 2 కూడా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవీనాటాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ సినిమాలో నటించే నటీనటుల రెమ్యునరేషన్ గురించి తెలిస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మొదటగా హీరో యష్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే ఈ సినిమాతో యష్ లెవెల్ కూడా పూర్తిగా మారిపోయింది.
ఇక మరో నటుడు సంజయ్ దత్… సంజయ్ దత్ ఈ సినిమాలో అధీర పాత్రలో నటించాడు . ఈ పాత్ర కోసం సంజయ్ దత్ పది కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. మరో క్యారెక్టర్ రమిక సేన్ బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ పాత్రలో నటించింది. థియేటర్స్ లో కూడా ఈ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాత్ర చేయడానికి గాను ఆమె ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారట.
ఇక మరో నటి హీరోయిన్ శ్రీనిధి శెట్టి… ఈ సినిమా కోసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక రావు రమేష్…రావు రమేష్ విషయానికొస్తే ఈ సినిమా లో సిబిఐ ఆఫీసర్ గా నటించారు. పాత్ర కోసం 80 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.
ప్రకాష్ రాజ్ విషయానికొస్తే ప్రకాష్ రాజ్ ఈ పాత్ర కోసం ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే మాలవిక అవినాష్…ఆమె పాత్ర కోసం కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇక ఆఖరిగా కే జి ఎఫ్ సినిమా కే హైలెట్ గా నిలిచిన మదర్ క్యారెక్టర్ అనిత జోష్… 30 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందట.