టాలీవుడ్ లో ఇప్పుడు సీనియర్ హీరోల హవా కాస్త తగ్గింది గాని వాళ్ళు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. బాలకృష్ణ, వెంకటేష్ మధ్య జరిగిన పోటీ ఈ మధ్య బాగా సందడి చేసింది. ఒకప్పటి మజా ఇప్పుడు వచ్చింది అనే చెప్పాలి. ఇక వెంకటేష్, నాగార్జున మాత్రం సినిమాల విషయంలో సైలెంట్ గా ముందుకు వెళ్తున్నారు. వెంకటేష్ తాజాగా మరో రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
బాలకృష్ణ
అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఇమేజ్ బాగా పెరిగింది. అటు షోస్ కూడా చేస్తున్నారు. దీనితో ఆయన 16 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టుగా టాక్ నడుస్తుంది.
చిరంజీవి
వాల్తేరు వీరయ్య సినిమాతో ఫాం లోకి వచ్చిన చిరంజీవి 40 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
నాగార్జున
సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరో రెమ్యునరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదని అంటున్నారు. పది కోట్ల వరకు తీసుకుంటున్నారని సమాచారం.
వెంకటేష్
ఈ స్టార్ హీరో హిట్ లు ఫ్లాపులతో కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఈయన రెమ్యునరేషన్ 12 కోట్ల వరకు ఉంది అని సమాచారం.