టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లను ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం లేదు. అందులో సావిత్రి, సౌందర్య ముందు వరుసలో ఉంటారు. అందరిది ఒక పద్ధతి అయితే వీళ్ళది మరో పద్ధతి అన్నట్టుగా ఉంటుంది. స్కిన్ షో విషయంలో ఎవరు ఏం అనుకున్నా సరే వాళ్ళు మాత్రం వెనక్కు తగ్గే అవకాశం లేదు. ఇక అనవసర ప్రచారాల విషయంలో మీడియాలో ఉండే విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు.
Also Read:రైతుల అభిమానం.. నారా లోకేష్ కి గుర్తుండిపోయే కానుక
వివాదాల్లో కూడా వీళ్ళు పెద్దగా ఉండేవారు కాదు. డాన్స్ కి నటనకు చాలా బాగా ప్రాధాన్యత ఇచ్చేవారు అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలో సాయి పల్లవి కూడా చేరింది. ఆమె అనవసరంగా మీడియాలో ఉండటానికి ఇష్టపడే హీరోయిన్ కాదు. ఇక ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా అలెర్ట్ గా ఉంటుంది. అలాగే స్కిన్ షో విషయంలో ఎక్కడా కూడా రాజీ పడే అవకాశం ఉండదు అని అంటారు.
సినిమాల్లో నటించడం తన జీవితం కాదని ఇష్టం మాత్రమే అని చెప్తూ ఉంటుంది. నటన విషయంలో సాయి పల్లవి ఈ తరం హీరోయిన్స్ లో చాలా ముందు ఉంటుంది అనే మాట వాస్తవం. డాన్స్ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడుతుంది ఈ అమ్మడు. తెలుగుతో పాటుగా మూడు భాషల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. తెలుగులో లేడీ పవర్ స్టార్ గా బిరుదు సంపాదించింది.
Also Read:బాలీవుడ్ లోకి మరో వారసురాలి ఎంట్రీ!