అలనాటి హీరోయిన్ జమున నేడు ఉదయం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని తన ఇంటిలో ఉదయం 5:30 నిమిషాలకు కన్నుమూసిన జమున వయసు వయసు 86 సంవత్సరాలు. 1936 ఆగస్టు ముప్పైన కర్ణాటక రాష్ట్రం హంపీలో జన్మించారు ఆమె. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో బాల్యాన్ని జమున గడిపారు. ఆమె తల్లిదండ్రులు కొప్పిని శ్రీనివాస రావు,కౌసల్య దేవీ.
1953 లో “పుట్టిల్లు” సినిమాతో వెండి తెరకు ఆమె పరిచయం అయ్యారు. అప్పుడు జమున వయసు కేవలం 15 ఏళ్ళు. తెలుగు ,దక్షిణ భారత భాషలన్నీ కలుపుకుని 198 చిత్రాల్లో నటించి మెప్పించారు జమున. జమునకు వినాయక చవితి చిత్రంలోని సత్యభామ పాత్ర మంచి పేరు తెచ్చింది. రాజకీయ నాయకురాల్లో సైతం తనదైన ముద్రవేసుకున్నారు.
1989 లో కాంగ్రెస్ నుంచి రాజమండ్రి ఎంపీగా విజయం సాధించి మంచి పేరు తెచ్చుకున్నారు. మిస్సమ్మ ,ఇలవేల్పు, గుండమ్మ కథ,ఇల్లరికం, లేత మనసులు చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. జమున కు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె కుటుంబం తో కలిసి హైదరాబాద్ బంజారాహిల్స్ లో జమున నివాసం ఉంటున్నారు. ఆ తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు ఆమె. మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. కృష్ణ కూడా ఏలూరు నుంచి ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయాల వైపు అడుగులు వేయలేదు.