పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు. థియేటర్స్ దద్దరిల్లుతాయి. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి సినిమా ఓ పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా కన్నా ముందు వచ్చిన అన్ని సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ సాధించాయి. మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అలాగే సుస్వాగతం, తొలిప్రేమ, గోకులంలో సీత, తమ్ముడు, బద్రి ఇలా అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి.
ఇందులో తొలిప్రేమ, తమ్ముడు పవన్ కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టాయి. అలాగే బద్రి పవన్ కెరీర్ నే మార్చేసింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లో నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాథ్ అంటూ చెప్పే డైలాగ్ అయితే ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుంది.
మహేష్ బాబు రిజెక్ట్ చేసిన 13 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవి చేసి ఉంటె ఇంకో లెవెల్ !
తమ్ముడు హిట్ అవడంతో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యి కోటి రూపాయల చెక్ ఇచ్చారట మేకర్స్. పవన్ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తొలిచిత్రం కూడా బద్రి కావటం గమనించాల్సిన విషయం. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ, కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన పూరి జగన్నాథ్ డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు కథ చెప్పేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నాడట.
అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉంటారు. ఆ అమ్మాయి హీరో తో మరో అమ్మాయిని ప్రేమించాలని పందెం వేస్తుంది. కానీ నిజంగా ప్రేమించుకుంటారు అంటూ లైన్ చెప్పాడట. చెప్పిన రెండు నిమిషాలకే పవన్ క్లైమాక్స్ అడిగి ఓకే చేశాడట. రెండే నిమిషాల్లో పవన్ ఈ స్టోరీ ఒకే చేయడం అప్పట్లో సెన్సేషన్ గా మారిందట.
సౌందర్య తమ్ముడు పెళ్లి చేసుకోవాల్సిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Advertisements
కహానా ఫ్యార్ హై సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అమీషా పటేల్ ను అలాగే మరో బాలీవుడ్ హీరోయిన్ రేణు దేశాయ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు పూరి. ఫస్ట్ షోకే హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. 2000 సంవత్సరం ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. 45 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన ఈ చిత్రం ఫస్ట్ వీక్ లోనే 2.5 కోట్ల షేర్ రాబట్టింది.