విశ్వవిఖ్యాత నటుడు నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కొంత మందిని గురువులుగా భావించేవారు ఎన్టీఆర్. కె.వి.రెడ్డి, చక్రపాణి కూడా ఆ లిస్టులో ఉండేవారు. అయితే వారిని ఎన్టీఆర్ ఎంతో ఉన్నతంగా గౌరవించే వారట. కాగా కె.వి.రెడ్డి తో కెరీర్ రోజుల్లో తన బ్యానర్ లోనే ఓ సినిమా చేయించుకోవాలని అనుకున్నారట ఎన్టీఆర్. అలా అప్పుడు తీసిన సినిమానే శ్రీకృష్ణసత్య. ఇది కమర్షియల్ పరంగా కె.వి.రెడ్డికి ఆఖరి చిత్రం.
ఇదిలా ఉండగా కేవి ఆఖరి రోజుల్లో ఎన్టీఆర్ ఆయనను చూసేందుకు రచయిత నరసరాజు కలిసి ఇంటికి వెళ్లారట. అప్పుడు కింద పోర్షన్ లో కె.వి.రెడ్డి భార్యను ముందుగా పలకరించారట ఎన్టీఆర్. అప్పుడు ఆమె తాను ఉండగానే తన భర్త చనిపోతే బాగుంటుందని అన్నారట. వెంటనే ఎన్టీఆర్ అదేంటమ్మా అంత మాట అన్నారు అని అడిగారట. తన భర్త చాలా మొహమాటంగా ఉంటాడని తను చనిపోతే కనీసం అన్నం పెట్టమని కూడా తన కోడలిని అడిగేందుకు ఇష్టపడడని అన్నారట.
విజయశాంతి చిరు 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదో తెలుసా ?
ఆ తరువాత పై అంతస్తులో ఉన్న కెవి రెడ్డిని కలిశారట ఎన్టీఆర్. ఆయన కూడా తన భార్య తన చేతుల్లో వెళ్లిపోవాలని కోరుకుంటున్నారట. అలా ఇంటి నుంచి బయటకు వచ్చాక ఎన్టీఆర్ నరసరాజు ఇదే లైన్ బేస్ చేసుకొని మూడు గంటల పాటు చర్చలు జరిపారట. ఆ వయసులో ఉన్న భార్య భర్తలు ఇద్దరూ ఇలా ఆలోచిస్తే ఏం జరుగుతుందన్న లైన్ తీసుకుని ఒక కథ డెవలప్ చేయమని నరసరాజు కి ఎన్టీఆర్ చెప్పారట.
ఆ సినిమాకు టైటిల్ కూడా పుణ్య దంపతులు అని డిసైడ్ చేసారట. ఎన్టీఆర్ ఎలాగైనా సినిమా తీయాలని మంచి పట్టుదలతో ఉండేవారట. కానీ ఆ సమయంలో ముఖ్యమంత్రి అవడం రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా ఆగిపోయింది.
సుకుమార్ గడ్డం వెనుక అసలు కథ ఇది!
కానీ ఆ స్క్రిప్ట్ మాత్రం ఎన్టీఆర్ లాకర్ లోనే ఉందట. చనిపోయాక ఆ లాకర్ ఓపెన్ కాకపోతే దానిని పగలగొట్టి చూడగా అందులో ఈ పుణ్య దంపతులు కథ ఉందట. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ బాలయ్య దగ్గరే భద్రంగా ఉందట. మరి ఎన్టీఆర్ అనుకున్న సినిమాను ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టు మార్చి బాలకృష్ణ సినిమా తీస్తారా లేదా అనేది చూడాలి.