మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన రీమేక్ చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ కావడంతో తెలుగులో చిరంజీవి చేయడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. నిర్మాత రామ్ చరణ్ సైతం సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకు ముందు వచ్చిన ఆచార్య సినిమా షాక్ ఇవ్వడంతో ఈ సినిమా విషయంలో మరింత శ్రద్ధ పెట్టారు.
ఇక ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతున్నా భారీ వసూళ్లు మాత్రం సాధించలేదు. ఆచార్య సినిమా కంటే తొలి రోజు వసూళ్లు తక్కువగానే ఉన్నాయి. చిరంజీవితో పాటుగా నయనతార, సత్యదేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. మురళీ శర్మ కూడా చాలా బాగా ఆకట్టుకున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయనతార పాత్రకు మంచి మార్కులు పడ్డాయి.
ఆమె హావభావాలు సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో ముందు చాలానే చర్చలు జరిగాయి. ఈ సినిమాకు అనుకున్న టైటిల్ “రాజ ‘కీ’ య నాయకుడు”. అయితే సినిమాలో పాత్ర ఆధారంగా చూస్తే… గాడ్ ఫాదర్ అయితేనే బాగుంటుందని సినిమా పరిశ్రమలో ఎందరికో ఆయన గాడ్ ఫాదర్ అని భావించి ఇలా పెట్టారట.