మెగాస్టార్ రెండో తమ్ముడు నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి అడుగు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా,నిర్మాతగా వివిధ పాత్రలు పోషించారు.అయితే నిర్మాతగా ఆర్థికంగా చాలా నష్టాలు చవిచూసారు.
ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణ రంగం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ మధ్యనే మరలా నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా మారారు.
చిరంజీవి సరైన వయస్సులోనే పెళ్లి చేసుకున్నా.. నాగబాబు మాత్రం 29 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు.రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఎవరీ అమ్మాయి బాగుంది అని అనుకున్నదట.
పద్మజ పెళ్లి కొడుకు తరఫున అమ్మాయి అయితే.. అంజనాదేవి పెళ్లికూతురు తరపున పెళ్ళికి వచ్చారట. పద్మజ బంధువుల అమ్మాయని తెలిసి అంజనాదేవి సంబరపడింది. ఆమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుండును అని అనుకున్నదట.
ముఖ్య విషయం ఏమిటంటే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని. చిరంజీవికి సంబందించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఆల్బమ్ ని తయారుచేసిందట. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఆల్బమ్ ని చూపించేదట. అలాగే వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించటంతో అంజనాదేవి మురిసిపోయి ఆమెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట.
తన అభిమాని నాగబాబు భార్యగా రావటం చిరు కూడా స్వాగతించాడు.ఆ విధంగా పద్మజ నాగబాబును పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలిలో భాగం అయింది. అప్పటి నుండి ఇప్పటివరకు పద్మజ వివాదాల జోలికి వెళ్ళటం జరగలేదు. భర్త, పిల్లల కోసం పాటు పడింది. ఆమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా ఉండేది.
ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సహాయం చేసింది. తన నగలు అమ్మి అప్పులు తీర్చమని చెప్పగా ఆ విషయం తెలిసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట. ఆ సమయంలోనే చిరు, పవన్ కలిసి నాగబాబుని ఆర్ధికంగా గట్టెక్కించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
నాగ బాబు కొడుకు వరుణ్ తేజ్ టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకొని సక్సెస్ ఫుల్ గా ముందుకి సాగుతున్నాడు. ఇక కూతురు నిహారిక కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాకపోవటంతో పెళ్లి చేసుకొని వెబ్ సిరీస్ నిర్మాణంలో సెటిల్ అయింది. ఆమెకు భర్త ప్రోత్సాహం కూడా ఉంది.