మామూలుగా దూరపు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ట్రైన్స్, బస్సు ఇలా రకరకాల మార్గాలను ఎంచుకుంటాము. ట్రైన్ లో వాష్ రూమ్ ఎమర్జెన్సీ అయితే అందుకు తగ్గట్టుగా వాష్ రూమ్ లు ఉంటాయి. అలాగే బస్సు లో ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఆ సమస్య వస్తే రోడ్డు పక్కన వాష్ రూమ్ ఉంటాయి. అయితే క్రికెటర్లు క్రికెట్ ఆడుతున్న సమయంలో గ్రౌండ్ లోనే ఉండాల్సి వస్తుంది. వన్డే మ్యాచ్ టైం లో అయితే 50 ఓవర్ల వరకు గ్రౌండ్ లోనే ఉండాలి.
ఆ సమయంలో వాష్ రూమ్ కి వెళ్లి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. నిజానికి రూల్స్ ప్రకారం క్రీడామైదానం లోకి అడుగుపెట్టాక బయటకు వెళ్లడం అనేది ఉండదు. కానీ వాష్ రూమ్ ఎమర్జెన్సీ మాత్రం ఆ రూల్ కు మినహాయింపు.
యాడ్స్ లో నటించటానికి నో చెప్పిన టాలీవుడ్ హీరోస్ వీరే!!
కానీ అలాంటి సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆట ఆడేటప్పుడు శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. అలాగే డ్రింక్స్ బ్రేక్ వచ్చినప్పుడు కూడా ప్లేయర్ వాష్ రూమ్ కి వెళ్లే అనుమతిని కల్పిస్తారు. ఆ సమయంలో వాష్ రూమ్ కి వెళ్లి రావచ్చు. ఆట మధ్యలో వాష్ రూమ్ కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కూడా కచ్చితంగా వెళ్లొచ్చు.
ఆ హీరో ఓకే చెప్పి ఉంటే…కేజిఎఫ్ రిజల్ట్ ఏంటో!!
ఇలా ఓసారి బంగ్లాదేశ్ ఇండియా మ్యాచ్ జరుగుతున్న సమయంలో మహేంద్రసింగ్ ధోని వాష్ రూమ్ కి వెళ్ళారు. అప్పుడు ఆయన స్థానంలో కోహ్లీ బాధ్యతలు తీసుకున్నాడు. 44 ఓవర్లలో ధోని వెళ్లగా 48వ ఓవర్ కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ధోని బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని టీమిండియా మేనేజర్ బిశ్వరూప్ దెయ్ ని అడిగినప్పుడు…వాష్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చిందని సమాధానం చెప్పాడు.