దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. అందుకే హీరోయిన్లు ఫాంలో ఉన్నప్పుడే వరుస సినిమాలు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. ఎందుకంటే హీరోలు కెరీర్ ఉన్నంత కాలం హీరోయిన్స్ కెరీర్ ఉండదు. తక్కువగానే ఉంటుంది. అలా కొన్ని హిట్ సినిమాలలో నటించిన హీరోయిన్స్ కూడా ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చారు.
అలా చాలా మంది హీరోయిన్లు ఇప్పటివరకు దూరమయ్యారు. అందులో రిచా మల్లాడ్ ఒకరు. నువ్వేకావాలి సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి క్రేజ్ ని సంపాదించుకుంది ఈ అమ్మడు. అయితే ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.
కొమురం భీముడో సాంగ్ కాపీ కొట్టారా? అది కూడా అక్కడి నుంచా!!
ఇంతకీ ఇప్పుడు రిచా ఏం చేస్తుందో తెలుసా? ఆ విషయాన్నే ఇప్పుడు తెలుసుకుందాం. 1980 ఆగస్టు 30న రిచా మల్లాడ్ పుట్టారు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. 200 పైగా యాడ్ ఫిలింస్ లో కూడా నటించారు.
ఎన్టీఆర్ కట్టించిన థియేటర్లు ఎందుకు మూతపడ్డాయో తెలుసా ?
నువ్వేకావాలి సినిమా హిట్ తో స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయింది. ఇక 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2013లో వీరికి ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత 2016 లో మలుపు అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కానీ ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత చిత్ర పరిశ్రమకు గుడ్ బై చెప్పేసింది. కాగా 41 ఏళ్ల వయసులో ఉన్న ఈ హీరోయిన్ నటిగాఆకట్టుకోలేకపోయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో రాణిస్తుంది. ప్రస్తుతం విడుదలవుతున్న చాలా సినిమాలకు రిచానే డబ్బింగ్ చెబుతున్నారు.