మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం చిరు ‘వాల్తేరు వీరయ్య’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా 2023 జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ చిత్రంపై మెగాస్టార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. డైరెక్టర్ బాబి రూపొందిస్తున్న ఈ మూవీ ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో వీళ్ల క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
Also Read: నరేశ్ నాల్గో భార్య కోసం మూడోభార్యకిచ్చే భరణం ఎంతంటే…?!
లేటెస్ట్ గా ఈ చిత్రం నుంచి ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ పాటని సంధ్య 70 ఎంఎం లో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. పాటకి తగ్గట్టుగానే మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది ఈ సాంగ్. రోల్ రిడా పూనకాలు తెప్పించే లిరిక్స్ అందించడంతోపాటు రామ్ మిర్యాలతో కలిసి ఫుల్ ఎనర్జిటిక్ గా పాడారు. అలాగే చిరంజీవి – రవితేజ తమ డైనమిక్ వాయిస్ తో ‘డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్’ అనడం పూనకాలని రెట్టింపు చేసింది.
అయితే ఇప్పుడు ఈ సాంగ్ లో మెగాస్టార్ చిరు వేసిన షర్టు గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ పాటలో చిరంజీవి ఎరుపు రంగు పూల చొక్కా ధరించి, మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. అయితే ఆ షర్ట్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా ఓ సంబంధం ఉంది.
రామ్ చరణ్ కూడా సేమ్ అలాంటి షర్ట్ ధరించి ఓ యాడ్ లో కనిపించాడు. చిరంజీవి వేసిన షర్ట్ చరణ్ దే అంటూ తెగ ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా మెగా హీరోలు ఇద్దరూ ఒకే డిజైన్ ఉన్న షర్టులో కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందంగా ఫీల్ అవుతున్నారు.
Also Read: ‘క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్’గా అవార్డు అందుకున్న రాజమౌళి