పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు అనే మార్కుని దాటి చాలా కాలమయ్యింది. సినిమాలలో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ప్రత్యర్థుల నుంచి అదే రేంజ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు పవన్. ముఖ్యంగా పవన్ ఎదుర్కునే ప్రధాన విమర్శ మూడు పెళ్ళిళ్ళు.
పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించినప్పటి నుంచి నేటి వరకూ ఈ ట్రోల్ జరిగుతూనే ఉంది. ఆయా సందర్భాల్లో విమర్శలకు కౌంటర్లిచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రత్యర్థులు మళ్ళీ మళ్ళీ పవన్ తాలూకు పెళ్ళిళ్ళ ప్రస్థావన తెస్తూనే వస్తున్నారు. అయితే రీసెంట్ గా హీరో బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో పెళ్ళిళ్ళకి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు పవన్.
ఆయన రెండో భార్యైన రేణుదేశాయ్ పవన్ కి దూరంగా ఉంటున్నా తరచూ మీడియాలో ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. రీసెంటుగా ఆమె ఓ మూవీలో క్యారెక్టర్ కూడా చేసింది. ఇక మూడో భార్య ‘అన్నలెజినోవా’ ఆయనతో కలిసిఉన్న సంగతి తెలిసిందే.
అయితే పవన్ తో విడాకులు తీసుకున్న ఆమె పేరు ఏంటి? ఇప్పుడు ఆమె ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు.అనేవిషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు. ఇప్పుడు ఆ విషయాలగురించి తెలుసుకుందాం.
స్వతహాగా ఇన్ట్రావర్ట్ అయిన పవన్ సినిమాల్లోకి రాకూదడు అనుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ లెవెల్లో ఉన్న హీరోల్లో ఒకరు. అసలు పెళ్ళిళ్ళే చేసుకోకూడదు అనుకున్నారు. ప్రస్తుతానికి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి అవ్వాలని తీవ్రంగా కృషిచేస్తున్నారు. డెస్టినీ ఎలా డ్రైవ్ చేస్తుందో తెలీదు.
పెళ్ళిళ్ళ విషయానికి వస్తే..ఆయన మాటల్లో… నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. కానీ.. మూడు సార్లు పెళ్లి చేసుకున్నాను..ఒకేసారి నేను మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.
మూడుసార్లు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను..భిన్నాభిప్రాయాల కారణంగా రెండుసార్లు విడాకులు తీసుకున్నాను..మొదటి పెళ్లి 1997లో నందిని అని అమ్మాయిని చేసుకున్నాను..కొన్ని కారణాలవల్ల 2007లో ఆమెకి విడాకులు ఇవ్వాల్సి వచ్చింది.
దాని అనంతరం రేణు దేశాయ్ తో సహజీవనం చేసిన అనంతరం 2009లో ఆమెని రెండవ వివాహం చేసుకున్నాను.2012లో కొన్ని కారణాలవల్ల తనకి కూడా విడాకులు ఇవ్వాల్సి వచ్చింది..అనంతరం 2013లో రష్యన్ యువతి అన్న లెజినోవా ని మూడవ పెళ్లి చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.
పవన్ మొదటి భార్య పేరు నందిని. అయితే పవన్ నుండి విడాకులు తీసుకున్న అనంతరం ఆమె తన పేరుని జాహ్నవిగా మార్చుకుంది. అనంతరం 2010లో కృష్ణారెడ్డి అనే ఒక డాక్టర్ని కూడా పెళ్లి చేసుకుంది ఈమె. దాని తర్వాత అమెరికాలో సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె తన భర్త పిల్లలతో సంతోషంగా ఉంది..!!
Also Read: ఆ సినిమా పోతుందని త్రివిక్రమ్ చెప్పారన్న నిర్మాత…!