విజయ్ దేవరకొండ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ పేరు ఏకంగా అర్జున్ రెడ్డిగా మారిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయాడు ఈ హీరో. అయితే ఇప్పుడు కెరీర్ లో సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా కూడా షాక్ ఇచ్చింది. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన క్రేజ్ ని వాడుకోలేకపోతున్నాడు.
ఇక తర్వలోనే ఖుషి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనపడుతుంది. అలాగే ఒక తమిళ సినిమాలో సూర్య పక్కన కనపడే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఆ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. అతను దర్శకుడు కాక ముందు పలువురు దర్శకుల వద్ద పని చేసాడు. ఎంబీబీఎస్ చదివినా సరే అతనికి సినిమాల మీదనే మక్కువ ఎక్కువ.
అందుకే నాగార్జున హీరోగా వచ్చిన కేడి సినిమా ద్వారా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టాడు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా కోసం రైటర్ గా కూడా పని చేసాడు. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత తన వద్ద కథ పట్టుకుని పలువురు హీరోల వద్దకు వెళ్ళినా సరే వాళ్ళు… వద్దు అనడంతో విజయ్ దేవరకొండ కు కథ చెప్పగా అతను ఓకే చేసాడు. ఇప్పుడు ప్రభాస్ తో ఒక సినిమా లైన్ లో పెట్టాడు.