అప్పట్లో హీరోల మధ్య మంచి సంబంధాలు ఉండేవి అనే మాట వాస్తవం. అందులో స్టార్ హీరోల మధ్య ఎక్కువ స్నేహం ఉండేది. అప్పట్లో జూనియర్ హీరోలుగా ఉన్న వారు సీనియర్ హీరోలను అభిమానించే వారు. శోభన్ బాబు తో చాలా మందికి మంచి సంబంధాలు ఉండేవి. ఆయన అప్పటి జూనియర్ హీరోలతో బాగా మాట్లాడేవారు అని అంటారు. చాలా మంది హీరోలు ఆయన్ను చూసి స్ఫూర్తి పొందేవారు.
ఆదాయం ఎలా దాచాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది ఆయన్ను చూసి నేర్చుకునే వారు. ఇలా విక్టరీ వెంకటేష్ కూడా ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నారు అని అంటారు. వెంకటేష్ కు శోభన్ బాబు అంటే చాలా అభిమానం అంటారు. ఆయనతో కలిసి నటించాలి అని కూడా ఆయన ప్రయత్నం చేసారని చెప్తారు. ఇక శోభన్ బాబు సూచనలను వెంకటేష్ ఫాలో అయ్యే వారు అని రామానాయుడు కూడా బాగా గౌరవించే వారు అని అంటారు.
ఇదిలా ఉంటే శోభన్ బాబు మీద వెంకటేష్ కు ఉన్న అభిమానం ఎలాంటిది అంటే… శోభన్ బాబుని హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని చూసి ఏకంగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు అప్పట్లో. వెంకటేష్ ఎంటర్ ప్రైజెస్ ఆనే నిర్మాణ సంస్థను స్థాపించి ఆ తర్వాత్ శోభన్‌బాబు – వాణిశ్రీ జంటగా ఎంకి నాయుడు బావ అనే సినిమా చేసారు. రామానాయుడు సమర్పణలో ఈ సినిమా వచ్చింది. బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు.