ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటన ఎంత ఆకట్టుకుందో విలన్ గా నటించిన బాబి సింహా నటన కూడా అంతే ఆకట్టుకుంది. బాబీ సింహా అంతకు ముందు తెలుగులో కనపడినా ఈ సినిమాతోనే ఎక్కువగా పేరు వచ్చింది అనే మాట వాస్తవం. దీనితో అసలు బాబీ సింహా ఎవరు అని సోషల్ మీడియాలో చర్చ కూడా మొదలయింది.
వాస్తవానికి అతనిది మన తెలుగు రాష్ట్రాలే. బందర్ లో పుట్టిన బాబీ సింహా కొన్నాళ్ళ పాటు హైదరాబాద్ లోని మౌలాలిలో ఉన్నాడు. ఆ తర్వాత కృష్ణా జిల్లా మోపిదేవి వచ్చి అక్కడ పది వరకు చదివాడు. ఇక డిగ్రీ చదవడం కోసం కోయంబత్తూరు వెళ్ళిన బాబీ సినిమాల మీద ఆసక్తితో తమిళం కూడా నేర్చుకున్నాడు. డిగ్రీ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. తమిళ సినిమాల్లో మంచి అవకాశాలే వచ్చాయి.
అక్కడ హీరో పాత్రలు కూడా చేసాడు. అలాగే విలన్ గా కూడా నటిస్తూ వచ్చాడు. ఇక బాబీ భార్య విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం. సహ నటి రేష్మి మీనన్ ప్రేమించి, 2016లో వివాహం చేసుకుని తండ్రి కూడా అయ్యాడు. ఆమె తెలుగులో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సాయి రామ్ శంకర్ హీరోగా వచ్చిన ఒక సినిమా అలాగే రాహుల్ రవీంద్రన్ హీరోగా వచ్చిన ఒక సినిమాలో నటించింది.
Also Read: తారకరత్న తండ్రి గురించి తెలియని విషయాలు…!