మంచు మనోజ్ … విభిన్న అభిరుచిగల నటుడు. మంచు ఫ్యామిలీలో…మోహన్ బాబు తర్వాత ఓ రేంజ్ చరిష్మా సంపాదించుకున్న నటుడు. అంతే కాదు మంచు కటుంబంలో వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి మంచు మనోజ్. మనోజ్ సినిమాలు ఈయన సినిమాలు వచ్చి సుమారు నాలుగు ఏళ్లు అయ్యాయి.
బిందాస్, మిస్టర్ నూకయ్య, వేదం, కరెంట్ తీగ వంటి సినిమాలతో మనోజ్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఒక దశలో వరుస హిట్లతో కెరీర్ ని బిల్డ్ చేసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి అటు కెరీర్ పరంగాను, ఇటు వ్యక్తి గతంగానూ ఒక్క సారిగా డౌన్ ఫాల్ కి వెళ్ళిపోయాడు.
ఇటీవల మనోజ్ దివంగత టిడిపి నేత అయిన భూమా నాగిరెడ్డి రెండవ కూతురు మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. కాగా ఇది మంచు మనోజ్ కు రెండవ వివాహం. ఇంతకు ముందే మనోజ్ కు పెళ్లి జరిగింది.
అయితే విభేదాల వల్ల ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. మనోజ్ 2017లో ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి పెద్దలందరి సమక్షంలో చాలా వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగిన రెండేళ్లకే విభేదాలతో విడాకులు తీసుకున్నారు.
మనోజ్ రెండవ పెళ్లి గురించిన వార్తలు నెట్టింట్లో వైరల్ అయినప్పటి నుండి మనోజ్ ఫస్ట్ భార్య గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందని? ఆమె కూడా రెండవ పెళ్లి చేసుకుందా అని? ఏం చేస్తుందనే వాటి గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
మనోజ్ మొదటి భార్య ప్రణతి అమెరికాలో ప్రస్తుతం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈమె అక్కడే ఇల్యూస్ట్రేషన్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారని సమాచారం. ఈ క్రమంలోనే మంచు మనోజ్ కొత్త మూవీ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు
Also Read: ఇండియాలో హిట్టైన ఇన్ స్పైర్డ్ పోస్టర్స్ …!?