టాలీవుడ్ లో ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉండే జంటల్లో మొదటి వారు రామ్ చరణ్, ఉపాసనా. ఉపాసనా అటు వ్యాపారాన్ని ఇటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. రామ్ చరణ్ కూడా ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అగ్ర హీరోగా సినిమాలు చేస్తూనే అటు వ్యాపార రంగం మీద కూడా ఫోకస్ చేసి ముందుకు వెళ్తున్నాడు. త్వరలోనే రామ్ చరణ్ తండ్రి కానున్నాడు.
ఇటీవల ఈ విషయాన్ని మెగా కుటుంబం ప్రకటించింది. ఉపాసనా ప్రస్తుతం ఇంటికే పరిమితం అయ్యారని సమాచారం. త్వరలోనే మెగా మనవడు అడుగు పెట్టె అవకాశాలు కనపడుతున్నాయి. ఇదిలా ఉంచితే పదేళ్ళ క్రితం వీళ్ళ ప్రేమ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య మంచి ప్రేమ ఉండటంతో రెండు కుటుంబాలు కూడా నో అనకుండా వివాహం చేసారు. కులాంతర వివాహం అయినా వెనక్కు తగ్గలేదు.
అసలు వీళ్ళు మొదట ఎక్కడ కలిసారు అనేది చూస్తే… లండన్ స్పోర్ట్స్ క్లబ్ లో కలిసారట. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరు ఇద్దరు కలిసారు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అలా ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. రామ్ చరణ్ లుక్ ఉపాసనా వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది అంటారు ఫాన్స్. రామ్ చరణ్ సినిమాల్లో ఎలా ఉండాలి అనేది కూడా ఆమె సలహాలు ఇస్తూ ఉంటారు.