క్రియేటివ్ ఫీల్డ్ అనే మాటే గానీ సినీపరిశ్రమలో మూస పద్ధతులకు, ముహూర్తాలకూ లోటుండదు. అవకాశం కోసమో,అవసరం కోసమో ఒక నటుడు లేదా నటి చేసిన పాత్ర హిట్టైతే ఇక అదేతరహాపాత్రలు వస్తుంటాయి. జనానికి బోరుకొట్టేదాకా అవే పాత్రలకు పేర్లు మార్చి జనమీద రుద్దేస్తుంటారు.
ఖర్మకాలి ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయితే ఇక ఆ నటుణ్ణి కన్నెత్తి కూడా చూడరు. మెరుగైన నటులే అయినా పైకారణాల రీత్యా కనుమరుగై పోతుంటారు. అలాంటి వారిలో ‘ఆరుగురు పతివ్రతలు’ ఫేమ్ అమృత ఒకరు.
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2004వ సంవత్సరంలో తెరకెక్కించిన “ఆరుగురు ప్రతివ్రతలు” అనే చిత్రం సినీ ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటుంది. వివాహ వ్యవస్థలో స్త్రీ ఎదుర్కుంటున్న కష్టాలను ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేసారు ఈవీవీ.
ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకుల్నిఅన్ని విధాలుగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రంలో అమృత, విద్య, నీత, ఎల్.బి.శ్రీరామ్, చలపతిరావు, రవివర్మ, అజయ్, రాజ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే ఈ చిత్రంలో ఇద్దరు భర్తలతో కలిసి కాపురం చేసేటువంటి వివాహిత పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ‘అమృత’. తక్కువ సినిమాలే చేసినా ఆమె ఇప్పటికీ సినీ ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.
ఇకపోతే ఈ సినిమా తర్వాత అమృత తెలుగు సినిమాలకు దూరమయ్యారు. బహుశా ఆమె మొదటి సినిమాలో నటించిన తరహాలోనే తర్వాత సినిమాలో పాత్రలు రావడంతో తాను దూరం అయ్యారని తెలుస్తోంది. ఇక ఈమె సినీ కెరీర్లో అన్ని భాషల్లో కలిపి కేవలం10 సినిమాలలో మాత్రమే నటించారు.
ఈ విధంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే వెండితెరకు దూరమైన అమృత, ప్రస్తుతం ఏం చేస్తుందనే విషయానికి వస్తే, వెండితెరకు దూరమైన ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
దీంతో పూర్తిగా సినిమాలకు దూరమై వివాహ జీవితానికి అంకితమయ్యారు. ప్రస్తుతం అమృత బెంగుళూరులో గృహిణిగా స్థిరపడినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఒక్క సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకొని అనుకోకుండా సినిమా పరిశ్రమకు దూరమైన నటీనటులలో అమృత ముందు వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.