గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా చరిత్ర సృష్టిస్తుంది ఇప్పటికీ. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఈ సినిమాలోని నాటు నాటు పాట సొంతం చేసుకుంది. ఇక నాటు నాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ డాన్స్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు.
తాజాగా నాటు నాటు పాట ఆస్కార్ కి కూడా నామినేట్ కావడం విశేషం. తాజాగా విడుదల చేసిన నామినేషన్స్ లో ఈ పాట కూడా ఉంది. దీనితో రాజమౌళి సహా చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. మార్చ్ లో దీనికి సంబంధించిన అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఇదిలా ఉంచితే నాటు నాటు పాటను ఎక్కడ షూట్ చేసారో ఒకసారి చూద్దాం. ఉక్రెయిన్ లోని ఒక ప్యాలెస్ ముందు షూట్ చేసారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలెన్ స్కీ ప్యాలెస్ అది. ఉక్రెయిన్ యుద్దంలో ఆయన హీరో అయ్యారు. ఆయన ఆర్టిస్ట్ కావడంతో పాట షూటింగ్ కోసం ప్యాలెస్ అడిగిన వెంటనే ఆయన ఒకే అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చాల ముఖ్యమైన సన్నివేశాలు ఈ ప్యాలెస్ లోనే షూట్ చేయడం విశేషం. 2018 లో ఒకసారి ఆ తర్వాత 2021 లో ఒకసారి షూట్ చేసారు. పాట కంటే కూడా డాన్స్ బాగా ఫేమస్ అయింది.