రంగస్థలం సినిమా తర్వాత మెగా హీరో రామ్ చరణ్ క్రేజ్ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ తర్వాత చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ దెబ్బకు అమెరికాలో అవార్డులు అందుకుంటున్నాడు. ఇక ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు సైతం ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే.
శంకర్ సినిమాతో కూడా రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూట్ లో మళ్ళీ పాల్గొనే అవకాశం ఉంది. రామ్ చరణ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు నచ్చిన సినిమాల గురించి చెప్పుకొచ్చాడు. తనకు బాగా నచ్చిన చిత్రాల్లో ది నోట్‌బుక్ ఒకటి అని అన్నాడు. ఆ తరువాత టెర్మినేటర్ 2 ఈ సినిమాను నేను ఎల్‌ఈడీ డిక్స్‌లో 50 సార్లకు పైగా చూసినట్టు రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
అలాగే గ్లాడియేటర్ సినిమా కూడా తనకు ఇష్టమని తెలిపాడు. తనకు చాలా ఇష్టమైన వాటిలో ది ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ మరింత ఫేవరేట్ అన్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత తెలుగులో తనకి ఇష్టమైన నాలుగు సినిమాల గురించి కూడా చెప్పాడు. మొదటిది దానవీరశూరకర్ణ, రెండవది బాహుబలి, మిస్టర్ ఇండియా, నాలుగవది తాను నటించిన రంగస్థలం సినిమా అన్నాడు రామ్ చరణ్.