శ్రీదేవి” ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపిన పేరు ఇది. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి జాతీయ స్థాయిలో లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించారు. ఆమె ఇతర భాషల్లో ఎంత ఫేమస్ అయినా సరే తెలుగులో ఆమెకు ఉన్న ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో దాదాపుగా అప్పట్లో అందరి హీరోలతో ఆమె నటించి మెప్పించింది.
అయితే ఒక్క బాలకృష్ణ తో మాత్రమే శ్రీదేవి సినిమా చేయలేదు. దీని వెనుక బలమైన కారణాలు చాలా ఉన్నాయనే టాక్ ఉంది. కాని వాస్తవాలు మాత్రం వేరే ఉన్నాయని అవి కేవలం పుకార్లు మాత్రమే అని అంటారు. అసలు ఆమె బాలయ్యతో ఒక్క సినిమా కూడా ఎందుకు చేయలేదో చూద్దాం. వాస్తవానికి రెండు సినిమాలు చేయాల్సి ఉన్నా సరే అవి ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏంటో చూద్దాం.
1987లో రాఘవేంద్రరావు, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన సామ్రాట్ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్ గా తీసుకోవాలని చూసారు. కాని అందుకు ఎన్టీఆర్ నో చెప్పారు. ఆ తర్వాత భలే దొంగ సినిమాలో కూడా బాలకృష్ణ, శ్రీదేవి సినిమా రావాల్సింది. కోదండ రామిరెడ్డి ఈ సినిమాను ప్లాన్ చేసారు. కాని నందమూరి అభిమానులు స్వయంగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి మీ పక్కన చేసిన హీరోయిన్ మళ్ళీ బాలకృష్ణ పక్కన వద్దని అన్నారట. దీనితో ఎన్టీఆర్ అప్పుడు కూడా వద్దనే చెప్పారు. దీనితో ఈ కాంబినేషన్ ఆగిపోయింది. మళ్ళీ ఎవరూ కూడా ఆ కాంబోలో సినిమా చేయడానికి ప్రయత్నం చేయలేదు.