ఇండియన్ సినిమా గర్వించే దర్శకుల్లో కె విశ్వనాథ్ ఒకరు. ఆయన చేసిన సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం అంటారు అభిమానులు, ప్రేక్షకులు. స్టార్ హీరోలు కూడా ఆయన సినిమాల్లో చేయడానికి అప్పట్లో ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన కథ చెప్తే కనీసం అందులో మార్పులు కూడా చెప్పేవారు కాదు చాలా మంది. సీన్ ఇలా రావాలి అంటే అలానే చేసేవారు హీరోలు.
అది కమల్ హాసన్ అయినా చిరంజీవి అయినా సరే అలానే ఉండేది. ఇక నటన పరంగా కూడా ఆయన ఎన్నో సినిమాల్లో వయసుకి తగిన పాత్రలు చేసారు. అప్పట్లో ఆయన సినిమాలు అంటే ఒక సంచలనం. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాంటి దర్శకుడికి ఈ తరం హీరోలలో ఎవరంటే ఇష్టం మరి…? దీనికి విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేసారు.
నేటితరం హీరోలలో ఏ హీరో అంటే మీకు ఇష్టం అనే ప్రశ్నకు గాను… ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలందరూ కూడా అద్భుతమైన నటనను కనబరుస్తున్నారని చెప్పారు. అందరిలో తనకు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ నటన చాలా బాగా నచ్చుతుందని చెప్పారు. వీరిద్దరి నటన నచ్చుతుంది అంటే మిగతా హీరోలు మంచిగా నటించరని అర్థం కాదని ఒక చిన్న వివరణ కూడా ఇచ్చారు. కాగా 2016 లో ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.