కొన్ని కొన్ని సినిమాలు సూపర్ హిట్ లు కావడమే కాదు హీరోల కెరీర్ ని కూడా మార్చేస్తూ ఉంటాయి. అలా రవితేజా కెరీర్ మార్చేసిన సినిమా ఈడియట్. ఈ సినిమా విషయంలో పూరి జగన్నాథ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేసారు. రవితేజా నటనకు అలాగే సినిమాలో కామెడికి మంచి మార్కులు పడ్డాయి. కమీషనర్ కూతుర్లకు మొగుళ్ళు రారా అంటూ రవితేజా పలికిన డైలాగ్ సూపర్ హిట్ అయింది.
అలాగే సినిమాలో రవితేజా గ్యాంగ్ చేసిన హడావుడి ప్రభావం అప్పట్లో యువత మీద బాగా పడింది. హీరోయిన్ కి కూడా ఈ సినిమా బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. ఇదిలా ఉంచితే ఈ సినిమా కథ ముందు పూరి జగన్నాథ్… పవన్ కళ్యాణ్ కు చెప్పారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం చేయడానికి ఇష్టపడలేదు. తన ఇమేజ్ కి ఆ కథ సెట్ అవ్వదు అనుకుని రిజెక్ట్ చేయడంతో పూరికి ఏం చేయాలో అర్ధం కాలేదు.
కొన్ని రోజులు సమయం తీసుకుని అదే కథను చిన్న చిన్న మార్పులు చేసి సుమంత్ కు చెప్పారు. సుమంత్ కూడా కథను రిజెక్ట్ చేయడంతో పూరికి ఒక ఆలోచన వచ్చింది. అప్పటికే తాను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా చేసి హిట్ కొట్టిన రవితేజాకి ఈ కథ వినిపించాలి అనుకున్నారు. రవితేజాకి కథ చెప్పడం సినిమా షూట్ చేయడం విడుదల కావడం నెలల వ్యవధిలో జరిగిపోయి సినిమా బంపర్ హిట్ కొట్టింది.