పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. థియేటర్స్ లో ఆయన సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆయన సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తుంది. అంతటి క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అలాగే మరో రెండు సినిమాలు కూడా లైన్ లో పెట్టాడు. ఇకపోతే మామూలుగా ప్రతి హీరోకి ఓ అభిమాని హీరో ఉంటాడు. అలాగే పవన్ కళ్యాణ్ కి కూడా ఓ ఫేవరెట్ హీరో ఉన్నాడు.
చిరు-బాలయ్య బాక్సాఫీస్ వార్ రెడీ అయిందా?
మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ కు ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి అని అందరూ అనుకుంటారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన హీరో చిరు కాదట…యాక్షన్ కింగ్ అర్జునట. నిజానికి ఈ విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. తాజాగా అర్జున్ కూతురు ఐశ్వర్య నటించిన కొత్త సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
సినిమా రిలీజ్ ను పెళ్లితో పోల్చిన హీరో
ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా అర్జున్ డైరెక్షన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా క్లాప్ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ సెట్స్ కు వచ్చారు. ఇక ఇటీవలే అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు విశ్వక్. ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ హైప్ నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టడానికి రావడం మరికాస్త హైపర్ నెలకొంది. అర్జున్ పై ఉన్న అభిమానం తోనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఓపెనింగ్ కు వచ్చారని తెలుస్తుంది.