టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో రాశీ ఒకరు. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి కూడా ఆమె సీరియల్స్ లో నటిస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. రాశీ కి నటన మీద ఎక్కువ ప్రేమ ఉండటంతో ఆమె భర్త కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. నెగటివ్ పాత్రలు అయినా సరే వెనకడుగు వేయకుండా చేయడానికి రెడీ అవుతున్నారు. మహేష్ బాబు సినిమాలో కూడా నటించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంచితే రాశీ ఇప్పుడు ఒక సీరియల్ ని డైరెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక ఆమెకు బాలకృష్ణ ఫాన్స్ లో మంచి గుర్తింపు ఉంది అనే చెప్పాలి. దాని వెనుక ఉన్న కారణం ఏంటో చూద్దాం. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన బాల గోపాలుడు సినిమాలో ఆమె ఆయన పక్కన బాల నటిగా నటించారు. ఇక అదే సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నటించారు.
హరికృష్ణ ను ఒప్పించి మరీ ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ ను బాలకృష్ణ తీసుకున్నారు. ఇలా బాలయ్య పక్కన ఆమె బాల నటిగా నటించారు. ఆ తర్వాత కృష్ణ బాబు అనే సినిమాలో రాశీ బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా చేసారు. ఇలా బాలనటి గా హీరోయిన్ గా ఆమె మెప్పించారు. కాగా బాలకృష్ణ ఇప్పుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా రానుంది.