కొన్ని సినిమాలు ఏ అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాలు సాధిస్తూ ఉంటాయి. అలాంటి సినిమానే కొత్త బంగారు లోకం. భారీ బడ్జెట్ లేకుండా వచ్చి భారీ విజయాలు సాధిస్తాయి సినిమాలు. అలాంటి సినిమానే కొత్త బంగారు లోకం. ఈ సినిమా హీరో వరుణ్ సందేశ్ అప్పటి వరకు కేవలం చేసింది ఒక్క సినిమా మాత్రమే. అయినా సరే దిల్ రాజు ఈ సినిమాను ధైర్యంగా చేయడానికి ముందుకు వచ్చారు.
శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ విన్న దిల్ రాజు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో ప్రేమ కథ అప్పట్లో యూత్ ని బాగా ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య సంభాషణ కూడా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఇంజినీరింగ్ విద్యార్ధులు అందరూ అప్పట్లో ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు. ఈ సినిమా హీరో వరుణ్ సందేశ్ కి ఈ సినిమా తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి.
అయితే ఈ సినిమాకు ముందు మరో హీరో అనుకున్నారు. ఆ హీరో ఎవరో కాదు నాగ చైతన్య. దిల్ రాజు ఈ సినిమాను నాగ చైతన్యతో చేసేందుకు ఆసక్తి చూపించినా నాగార్జున నో అన్నారట. అప్పటికి నాగ చైతన్య ఇంకా సినిమాల్లోకి రాలేదు. జోష్ సినిమా కథ వింటున్నాడు. నాగార్జున నో చెప్పడంతో వెంటనే ఈ సినిమాకు వరుణ్ సందేశ్ ని అడిగారు. వరుణ్ సందేశ్ ఓకే చేయడంతో సినిమా వెంటనే షూటింగ్ పూర్తి చేసారు.