కొన్ని కొన్ని సినిమాలు హీరోలకు మంచి ఇమేజ్ తీసుకొస్తాయి. అప్పటి వరకు వారిపై ఉన్న అభిప్రాయాన్ని కూడా మార్చేస్తూ ఉంటాయి. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఇదే జరుగుతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు ముందు విజయ్ దేవరకొండ ఇమేజ్ వేరు ఆ తర్వాత వేరు. పోకిరి సినిమాకు ముందు మహేష్ ఇమేజ్ వేరు ఆ తర్వాత వేరు. ఆర్య సినిమాకు ముందు అల్లు అర్జున్ వేరు ఆ తర్వాత వేరు.
అలాంటి సినిమా కథలను గ్రహించి ఆఫర్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా చేసేస్తే సమస్య ఉండదు. లేదంటే మాత్రం తర్వాత ఫాన్స్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటి సినిమానే నితిన్ మిస్ అయ్యాడు. అదే ఆర్య సినిమా. ఈ సినిమాను అసలు నితిన్ చేయాల్సింది కాని అల్లు అర్జున్ కి వెళ్లి ఇమేజ్ మారిపోయింది. మొదటి సినిమా జయంతో డీసెంట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో.
ఆ తర్వాత వచ్చిన దిల్ సినిమాతో అతని ఇమేజ్ మారిపోయింది. అదే సమయంలో ఆర్య కథ సుకుమార్ చెప్పారు. దిల్ సినిమాకు సుకుమార్ కూడా పని చేసారు. కాని అప్పటికే ఆరు సినిమాలకు నితిన్ సంతకం చేసాడు. దీనితో ఆర్య సినిమాను వద్దన్నాడు. ఆ సినిమా కథ వెంటనే అల్లు అర్జున్ కి అల్లు అరవింద్ కి చెప్పడం వాళ్ళు ఓకే చేయడం జరిగాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో, దర్శకుడి కెరీర్ మారిపోయింది.