జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులకు జీవితం ఇచ్చింది. టాలెంట్ ఉన్న నటులను తెర పైకి తీసుకు వచ్చింది. అందులో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. జబర్దస్త్ షోలో ఆర్పీ ఎన్నో స్కిట్ లను చేశారు. అయితే మెగా బ్రదర్ నాగబాబు షో కు దూరమైన తర్వాత ఆర్పీ కూడా ఆ షో ను వదిలి పెట్టేశారు.

ఇక అప్పటి నుంచి కూడా అదిరింది షోలో స్కిట్ లు చేస్తున్న ఆర్పీ… ప్రస్తుతం స్టార్ మా లో వస్తున్న కామెడీ స్టార్స్ షో లో స్కిట్స్ చేస్తున్నాడు. కాగా ఇప్పుడు ఈ కమెడియన్ పెళ్లికొడుకు అవ్వబోతున్నాడు.

అవును మీరు విన్నది నిజమే ఆర్పీ నిశ్చితార్థం కూడా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్పీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు లక్ష్మీప్రసన్న. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు జబర్దస్త్ కమెడియన్ లు, ఆర్పీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
ఈ పెళ్ళి ముహూర్తం కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగింది.
Also Read: మహేష్ సినిమాలో తారకరత్న ఉన్నాడా?
200 కోట్ల క్లబ్ లోకి మహేష్ మూవీ