ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కే జి ఎఫ్. 2018 లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. రవి బస్రూర్ సంగీతం, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ నటీనటుల అన్నీ కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా 2022లో కే జి ఎఫ్ పార్ట్ 2 కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కూడా అనుకున్నట్టుగానే ఘన విజయం సాధించింది.
నిర్మాతలకు కూడా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మొదటి పార్ట్ లో కాస్త ఎమోషన్స్ తగ్గినప్పటికీ… సెకండ్ పార్ట్ లో ఆ ఎమోషన్స్ ని కవర్ చేశాడు. అలాగే సెకండ్ పార్ట్ లో రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఎఫెక్ట్ జనాలపై ఎలా పడింది అంటే యశ్ ప్లేస్ లో మరొకరిని ఊహించుకోలేము. అయితే ప్రశాంత్ నీల్ మొదట వేరే హీరోని అనుకున్నాడట.
మన స్టార్ హీరోల అసలు పేర్లు మీకు తెలుసా?
అది మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఆయనకు కథ చెప్పడానికి ప్రశాంత్ ప్రయత్నించాడట. కానీ అపాయింట్మెంటు దొరకలేదట. అప్పుడు కన్నడ ఇండస్ట్రీ గొప్పతనమేంటో పాన్ ఇండియా లెవెల్ లోకి చూపించాలని నిర్ణయం తీసుకున్నాడట.
యాడ్స్ లో నటించటానికి నో చెప్పిన టాలీవుడ్ హీరోస్ వీరే!!
అందుకే కన్నడ హీరో తన సినిమా చేద్దామని డిసైడ్ అయ్యి యశ్ తో సినిమా చేశాడు. కట్ చేస్తే రిజల్ట్ బ్లాక్ బస్టర్.