సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే స్టార్లు అవుతారు. మిగిలిన వారు అంతంతమాత్రంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. మరికొంతమంది టాలెంటు ఉన్నా సరే అనుకున్న స్థాయిలో రాణించలేరు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఇండస్ట్రీలో ఎదగాలంటే కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. అయితే అలా రాజీపడకుండా స్టార్ లు కాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని సార్లు వారు తీసుకున్న నిర్ణయాలు కూడా వారి కెరీర్ కు శాపంగా మారుతాయి.
17 సంవత్సరాల క్రితం 7/G బృందావన్ కాలనీ సినిమాతో క్రేజ్ ను సంపాదించుకుంది సోనియా అగర్వాల్. ఏం రత్నం కొడుకు రవి కృష్ణ హీరోగా వచ్చిన 7/G బృందావన్ కాలనీ హీరోయిన్ గా ఈ అమ్మడు నటించింది.
ఆ తరువాత ఈ సినిమా దర్శకుడు సెల్వ రాఘవన్ తో ప్రేమలో పడింది. 2006లో పెళ్లి కూడా చేసుకుంది. భర్త కోరిక మేరకు సినిమాలను దూరం పెట్టింది. కానీ కొన్నాళ్లకే సెల్వ రాఘవన్ తో మనస్పర్ధలు వచ్చి విడిపోయింది.
2009లో విడాకులు తీసుకుంది. పెళ్లికి ముందు తన అందంతో అభినయంతో ఒక ఊపుఊపిన సోనియా అగర్వాల్ పెళ్లి తర్వాత రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ అనుకున్న స్థాయిలో అయితే అవకాశాలు రాలేదు.
గతంలో టెంపర్ సినిమాలో చిన్న పాత్ర వచ్చింది. అనుకున్న స్థాయిలో క్రేజ్ అయితే రాలేదు. సోనియా అగర్వాల్ పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే కెరీర్ వేరేలా ఉండేదని పెళ్లి చేసుకొని భవిష్యత్తును తన చేతులారా చెడగొట్టుకుందని ఆమె అభిమానులు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.