జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అదుర్స్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ముఖ్యంగా ఆయన చేసిన కామెడికి అయితే ఫాన్స్ చాలా ఎక్కువ. ఇప్పటికి కూడా దానికి సంబంధించిన సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. బ్రహ్మానందం తో కలిసి ఆయన చేసిన కామెడి అప్పట్లో చాలా బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ల గ్లామర్, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా సెట్ అయ్యాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి. బరువు కూడా అప్పుడు బాగా తగ్గాడు ఎన్టీఆర్. పంతులు గారి పాత్రలో ఎన్టీఆర్ ను చూసిన వాళ్ళు అయితే తెగ పొగిడేశారు. ఇదిలా ఉంచితే… ఈ సినిమా వాస్తవానికి రామ్ చరణ్ చేయాల్సి ఉందట. కోనవెంకట్ ఈ సినిమాకు కథ అందించిన సంగతి తెలిసిందే.
డైరెక్టర్ వివీ వినాయక్ చాలా జాగ్రత్తగా చేసారు ఈ సినిమా. రామ్ చరణ్ కు కథ చెప్పినా… అప్పుడు సినిమాల్లో రామ్ చరణ్ కొత్త కాబట్టి సరిగా సెట్ అయ్యే అవకాశం ఉండదు అని భావించి… ఆ పాత్రకు న్యాయం చేయడం కష్టం కాబట్టి ఇబ్బందవుతుందని అదే కథను ఎన్టీఆర్ కు చెప్పగా ఆయన వెంటనే ఓకే చేసాడు. సినిమా అప్పుడు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.