సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణించాలంటే చాలా కష్టపడాలి. టాలెంట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అదృష్టం కలిసి రాకపోతే ఎవరూ ఏం చేయలేరు. ఒక్క సినిమాతో కొంత మంది స్టార్ హీరోలు అవుతారు. మరి కొంత మంది మాత్రం ఆ ఒక్క సినిమాతో చాలా కిందకు పడిపోతారు. అలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నెంబర్ వన్ స్టార్ గా నిలదొక్కుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో సూపర్ సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అందులో కొన్ని రీమేక్ సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటే శంకర్ దాదా ఎం బి బి ఎస్.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఒరిజినల్ కి ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాలో మరో క్యారెక్టర్ కూడా పెట్టాడు దర్శకుడు. అదే ఏటీఎం. చిరంజీవికి తమ్ముడిగా ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ నటించారు.
రావు గోపాల్ రావు అన్ని ఇబ్బందులు పడ్డారా? చనిపోయాక కూడా ఎవ్వరూ పోలేదట!
ఈ సినిమాలో శ్రీకాంత్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే చాలా మందికి తెలియని ఓ ఆసక్తికర విషయం ఏమిటంటే ఏటీఎం పాత్రకు మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అనుకున్నారట. కానీ అప్పటికే వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంవల్ల పవన్ కి కుదరలేదట.
దీంతో ఓ సందర్భంలో శ్రీకాంత్ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఏటీఎం పాత్ర చేస్తావా అని చిరంజీవి అడగగా శ్రీకాంత్ ఆలోచించకుండా ఓకే చెప్పారట. ఇలా ఆ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం వల్ల ఆ పాత్రలు మరింత అద్భుతంగా పండాయి. ఆ విధంగా శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా లో శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో నటించాడు.
ఆషాడం లో కొత్తగా పెళ్లైన వారు దూరంగా ఉంటారు…ఎందుకో తెలుసా ?
Advertisements