అలనాటి తార సౌందర్య గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌందర్య కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రెండు దశాబ్దాల క్రితం స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు సౌందర్య. పేరుకి కన్నడ అమ్మాయి అయినప్పటికీ తెలుగులోనే స్టార్డమ్ ను తెచ్చుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి హీరోల పక్కన కూడా నటించి హిట్ కొట్టింది.
హీరో తో సంబంధం లేకుండా సౌందర్య ఉంది అంటే చాలు సినిమా హిట్ అనే ఒక భావన సగటు ప్రేక్షకుడికి అప్పట్లో తీసుకువచ్చింది సౌందర్య. ఆ స్థాయిలో క్రేజ్ ను తెచ్చుకుంది. అయితే మరోవైపు తమిళంలో రజనీకాంత్ తో పాటు పలువురు స్టార్ హీరోలతో కూడా నటించి మంచి హిట్ ను అందుకుంది. ఇక ఆ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సౌందర్య తన బావ ని పెళ్లి చేసుకుంది.
రష్మిక రిజెక్ట్ చేసిన 5 హిట్ సినిమాలు ! నిజంగా ఈ సినిమాలలో లేకపోవడం బ్యాడ్ లక్ !
ఇక 2004లో కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన బిజెపి అభ్యర్థి విద్యాసాగరరావు ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్ లో కరీంనగర్ వస్తూ ప్రమాదవశాత్తు హెలికాప్టర్ కూలి చనిపోయారు సౌందర్య. ఆ ప్రమాదంలో సౌందర్య అన్న అమర్ కూడా మృతిచెందారు.
అయితే ఇదిలా ఉండగా సౌందర్య అన్న అమర్ కు ఓ స్టార్ హీరోయిన్ తో అప్పుడు పెళ్లి జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు… ఆమని. సౌందర్య హీరోయిన్ గా ఉన్నప్పుడే ఆమని కూడా సౌత్ ఇండియాలో మంచి స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఆమె కూడా కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి కావడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది.
ఎన్టీఆర్ రోల్ తగ్గించేశారు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ !
ఒకానొక సమయంలో సౌందర్య ఎక్స్పోజింగ్ ఎందుకు చేయవు నువ్వు అని ఆమని అడిగితే…. రేపు పెళ్లి అయ్యాక నాకు ఒక మొగుడు వస్తాడు. నువ్వు ఎందుకు అలా చేసావు అని అడుగుతాడు, అలా ఎందుకుఅడిగించుకోవాలి ?అందుకే చేయను అని చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమనినే చెప్పారు. అలాగే ఓసారి సౌందర్య తండ్రి ఆమనితో మా అబ్బాయి అమర్ ను నువ్వు పెళ్లి చేసుకో అని అడిగారట. షాక్ అయిన ఆమని నేను ఒక ఆర్టిస్టు సార్ చెప్పిందట. మా అమ్మాయి కూడా హీరోయిన్ నువ్వు హీరోయిన్ కదా ఇద్దరూ వదిన మరదలు అయితే బాగుంటుంది. అమర్ నువ్వు సరిజోడి అవుతావు అని అన్నారట.
ఆ సంఘటన జరిగినప్పుడు తెలంగాణ శకుంతల కూడా పక్కనే ఉన్నారని ఆమని గతంలో చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత అమర్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాని దురదృష్టవశాత్తు సౌందర్య తో పాటే హెలికాఫ్టర్ ప్రమాదంలో అమర్ కూడా మృతి చెందాడు.