దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇంటిల్లిపాది నవ్వుకుంటూ చూడాలంటే ఆయన సినిమా చూడాల్సిందే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయన వారసులుగా ఇండస్ట్రీలోకి ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ లు అడుగుపెట్టారు.
అల్లరి నరేష్ ఇప్పటికి కూడా తన నటనతో డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్ మాత్రం మొదట్లో మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ తరువాత సినిమాలకు దూరమయ్యారు.
విశ్వక్ సేన్ ఇష్యూ ఎఫెక్ట్… ఎవరీ దేవి నాగవల్లి
రాజేష్ తన తండ్రి స్నేహితుడి కుమార్తె సుభాషిణి వివాహం చేసుకున్నారు. మొదట సుభాషిణి ఫోటో ని ఆర్యన్ కు పంపించి పెళ్లి చేసుకోవాలని కోరారట. కానీ అందుకు ఆయన నిరాకరించారట. ఆ తరువాత డైరెక్ట్ గా చూసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడట. 2011 జనవరి 5న మీరు పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులు జరిగిన వారానికే అంటే జనవరి 11న ఇవివి సత్యనారాయణ మరణించారు.
సుభాషిణి ఆ సమయంలో ఆర్యన్ కు ఎంతగానో సపోర్ట్ గా నిలిచిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు ఆర్యన్. ఆ తరువాత 2012 ఫిబ్రవరి 12న ఆర్యన్ రాజేష్ పెళ్లి చేసుకున్నారు. వీరికి సంవత్సర కాలానికి ఒక కుమారుడు కూడా పుట్టాడు. దీంతో ఇవివి నే మళ్లీ పుట్టాడు అని భావించారు కుటుంబసభ్యులు. ఆ తర్వాత 2015లో మే 29న అల్లరి నరేష్ వివాహం చేసుకున్నారు.
ఆర్ఆర్ఆర్, పుష్ప,భీమ్లానాయక్ కన్నా అఖండ పెద్ద హిట్ … ఎలానో తెలుసా !!