సినిమా పరిశ్రమలో ఉండే ప్రతీ విషయం మీద జనాలకు ఆసక్తి ఉంటుంది. అగ్ర హీరోల నుంచి జబర్దస్త్ నటుల వరకు ప్రతీ ఒక్కరి మీద తెలియని ఆసక్తి కొనసాగుతుంది. ఇక మీడియా కూడా ఇలాంటి విషయాల మీద చాలా ఫోకస్ చేస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాత్రం ఇక సినిమా వాళ్ళు దగ్గినా తుమ్మినా వార్త అయిపోయింది అనే మాట నిజం.
ముఖ్యంగా అప్పటి విషయాల మీద చాలా ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా అప్పట్లో నటించిన బాల నటుల గురించి ఇప్పుడు సోషల్ మీడియా జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అలా ఇప్పుడు ఒక హీరోయిన్ ఫేమస్ అవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు శ్రీవిద్య. బాల నటిగా సినిమాల్లోకి వచ్చిన ఈ అమ్మడు ఇప్పుడు హీరోయిన్ గా కొనసాగుతుంది. తెలుగులో కంటే ఇతర బాషలలో సినిమాలు ఎక్కువగా చేస్తుంది.
తెలుగులో ఆమె చేసిన సినిమాలకు మంచి స్పందనే వచ్చింది. ఇక చిన్నప్పుడు తాను మహేష్ బాబు హీరోగా వచ్చిన ఒక సినిమాలో బాల నటిగా నటించింది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు ఆ ఫోటోలో శ్రీ విద్యను ఎత్తుకుని ఉంటాడు. ప్రస్తుతం ఆమె తెలుగులో సినిమాలు చేయకపోయినా తమిళంలో మంచి ఆఫర్స్ కొట్టేస్తుంది.