ఆసీస్ ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ మార్చి 27న వివాహం చేసుకోబోతున్నారు. తన స్నేహితురాలు ఇండియన్ అయిన వినీ రామన్ ను పెళ్లి చేసుకోబోతున్నారు.ప్రస్తుతం మ్యాక్స్‌వెల్, రామన్‌ల వివాహ ఆహ్వానపత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుంది. తమిళ సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరుగుతుందని తెలుస్తోంది.
ఈ జంట ఒక సంవత్సరం క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా మాక్స్‌వెల్ అధికారికంగా పెళ్లి విషయాన్ని చెప్పారు. అయితే ప్రస్తుతానికి, విని రామన్, మాక్స్‌వెల్ ఎలా కలుసుకున్నారు అనే దాని గురించి సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది.
ఆస్ట్రేలియా వెళ్లి అక్కడి పౌరసత్వం పొందిన భారత సంతతి అమ్మాయి వినీ. ఆమె ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఫార్మసీ ప్రాక్టీస్ చేస్తోంది. గతంలో, ఆమె 2019 మరియు 2020లో జరిగిన ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్‌తో సహా కొన్ని పబ్లిక్ ఈవెంట్‌లకు మాక్స్‌వెల్‌తో కలిసి వచ్చింది.
ఆమె విక్టోరియాలో తన విద్యను పూర్తి చేసింది. వైద్య శాస్త్రాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువును కొనసాగించింది. మాక్స్‌వెల్‌తో బహిరంగంగా కనిపించిన తర్వాత ఆమె సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించడం ప్రారంభించింది.