జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో టెంపర్ ఒకటి. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో ఒక మంచి హిట్ కోసం చూస్తున్న ఎన్టీఆర్ కు ఈ సినిమా బాగా కలిసి వచ్చింది అనే చెప్పాలి. అక్కడి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు ఇప్పటికి కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ డైలాగుల విషయంలో పూరిని మెచ్చుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కంటే కూడా ఎక్కువగా రచయిత వక్కంతం వంశీని ఎక్కువగా నమ్మారు అని అంటారు. ఇక ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కంటే ఆ రేంజ్ లో హిట్ అయిన పాత్ర పోసాని కృష్ణ మురళి పాత్ర. పోసాని కృష్ణ మురళీ పాత్రకు హీరో పాత్ర ఇచ్చే గౌరవం కూడా లాస్ట్ లో బాగుంటుంది. అవినీతి చేయని ఒక పోలీస్ అధికారిగా ఆయన నటించారు.
ఎన్టీఆర్ అవినీతి నచ్చక పోసాని కృష్ణ మురళి ఆయనకు సెల్యూట్ కూడా చేయకపోవడం సినిమాలో హైలెట్ అయిన అంశం గా చెప్పాలి. ఇక ఆయన వయసుని గౌరవించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఆ పాత్రకు ముందు అనుకున్నది ఆర్ నారాయణ మూర్తిని. దర్శకుడు పూరి… ఆర్ నారాయణ మూర్తిని ఎన్ని సార్లు అడిగినా ఆయన చేయను అని చెప్పడంతో పోసాని కృష్ణ మురళిని ఎంపిక చేసారట.