ప్రతీ నటుడికి ఉండే ఒకే ఒక కల ఆస్కార్ గెలవాలి అని. ఎంత అగ్ర నటుడు అయినా సరే ఆస్కార్ రాకపోతే జీవితానికి అర్ధం ఉండదు అని భావిస్తారు. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఇంకే వుడ్ అయినా సరే ఆస్కార్ కోసం ప్రయత్నాలు చేసేవారు చాలా మందే ఉన్నారు. మన దేశానికి ఆస్కార్ అవార్డులు తక్కువగానే వచ్చాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ హడావుడి పెరిగింది. అసలు మన దేశంలో ఆస్కార్ గెలిచిన నటులు ఎవరో చూద్దాం.
భాను అథైయా
గాంధీ సినిమాకు గాను ఆమె తొలి ఆస్కార్ అందుకున్నారు మన దేశంలో. 1982 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమాకు 55వ ఆస్కార్ వేడుకల్లో అవార్డ్ వచ్చింది. గాంధీ సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్ గా పని చేసి ఆవార్డు గెలుచుకున్నారు.
సత్యజిత్ రే
ఆ తర్వాత సరిగా పదేళ్లకు సత్యజిత్ రే అవార్డు అందుకున్నారు. ఆయన అప్పుడు అనారోగ్యంతో ఉండటంతో ఆస్కార్ ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి ఇచ్చారు.
స్లం డాగ్ టీం
స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు గాను 2009 లో అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు గాను రసూల్ ఆస్కార్ సొంతం చేసుకోగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గుల్జార్ కు అవార్డు వచ్చింది. ఇక రెండు విభాగాల్లో సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ కు అవార్డు వచ్చింది.