సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు నిలుస్తున్నారు అంటే వాళ్ళు విడుదల చేసే సినిమాల గురించి ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. సినిమాల విషయంలో స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా ఉంటూ సినిమాలను విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సంక్రాంతి బరిలో 2020 లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాకు మంచి స్పందన వచ్చింది. సినిమాలో చాలా భాగం హీరో తండ్రి ఇల్లు ఉండే వైకుంఠపురములోనే షూట్ చేసారు.
Also Read:పోలీసులా.. రౌడీలా.. మరీ ఇంత దారణమా..?
అయితే ఆ ఇంటి గురించి చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి. ఆ ఇల్లు సెట్ కాదట… ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి అల్లుడి ఇల్లు. ఆయన కుమార్తె రచన చౌదరి… భర్త ఇల్లు అది. ఆయన పేరు సబినేని విష్ణు తేజ. నరేంద్ర చౌదరి కుటుంబం… హారిక హాసిని అధినేతకు బంధువులే. ఆ బంధువుత్వంతో సినిమాలో ఆ బంగ్లా చూపించే అవకాశం దొరికింది.
సుమారు 200 కోట్ల తో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. అత్తవారింటికి దారేది సినిమాకు రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేసిన త్రివిక్రమ్… ఈ సినిమాకు కూడా అదే విధంగా ప్లాన్ చేయాలని చూసారు. భారీ సెట్ కోసం ట్రై చేసి విదేశాల్లో కూడా చూసారు. అయితే ఆ ఇల్లు నచ్చడం తో త్రివిక్రమ్ 20 రోజులు షూటింగ్ కి ఇల్లు కావాలని చెప్పడంతో విష్ణు ఒకే చేసారట.
Also Read:నేడు మేడారానికి సీఎం