నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో కీరవాణి పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఆయన మొన్న ఉదయం మన కాల మానం ప్రకారం అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంచితే ఆయన తండ్రి శివ శక్తి దత్తా పలు కీలక విషయాలు చెప్పారు. కీరవాణికి ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది వివరించారు. నాటు నాటు పాటకు అవార్డు రావడంతో సంతోషానికి అవధులు లేకుండా పోయాయని అన్నారు ఆయన.
ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. గోల్డెన్ గ్లోబ్ వచ్చిన సమయంలోనే చాలా సంతోషించానని పేర్కొన్నారు. ఆస్కార్ వచ్చిందని టీం చెప్పిన వెంటనే చాలా గ్రేట్ అని ఫీలయ్యానని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డ్ వచ్చే ముందురోజు రాత్రంతా మేలుకుని ఉన్నానని అన్నారు. చిలక అని కీరవాణిని పిలుస్తానని అలా పిలవడానికి ప్రత్యేక కారణం ఉందని ఆయన వివరించారు. నేను ఆరు భాషల్లో కవిత్వం రాయగలనని అన్నారు ఆయన.
తాను అప్పట్లో మద్రాస్ లో ఉండేవాడినని… అప్పట్లో సంగీతం తెలిసినా నాకు రాగాలు తెలియవని ఒక పాట రాగం కీరవాణి అని ఆ పేరు నా పిల్లలకు పెట్టాలని ఫిక్స్ అయ్యానని గుర్తు చేసుకున్నారు. కీరవాణి పేరు ఆడపిల్ల పేరు అయినప్పటికీ దేవుడు ఆ విధంగా పెట్టాలని చెప్పాడని భావించి పెట్టినట్టు పేర్కొన్నారు. కీరవాణి, రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉందని అన్నారు ఆయన. ఆ కాంబినేషన్ అలా కొనసాగుతోందని కొనియాడారు.